ఇక “భీమ్లా నాయక్” రిలీజ్ ఆగిపోయినట్టేనా.!

Published on Apr 5, 2022 4:00 pm IST


ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి భారీ ఓపెనింగ్స్ దక్కించుకొని అదరగొట్టిన మాస్ చిత్రం “భీమ్లా నాయక్”. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు హీరోలుగా నిత్య మీనన్ మరియు సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాని యంగ్ దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కించాడు.

మరి పవన్ కెరీర్ లో మరో బిగ్ హిట్ గా నిలిచిన ఈ సినిమా రిలీజ్ వరకు ఎన్నో మలుపులు తిరిగాయని చెప్పాలి. అయితే ఈ సినిమా రిలీజ్ యుఫోరియా లో ఈ సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత నాగవంశీ అనౌన్స్ చెయ్యడం మరింత ఆసక్తిగా మారింది. అయితే అప్పుడే మార్చ్ మొదటి వారంకే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఏప్రిల్ రిలీజ్ అవుతుందని వాయిదా పడింది.

అయితే ఇపుడు ఏప్రిల్ వచ్చినా కూడా ఈ సినిమా హిందీ రిలీజ్ పట్ల ఇంకా ఎలాంటి బజ్ లేదు. సో హిందీ రిలీజ్ కి సంబంధించి ఆగిపోయినట్టే అనుకోవాలి అనిపిస్తుంది. ఇప్పుడు కూడా పలు సినిమాలు రిలీజ్ కి హిందీలో ఉన్నాయి. సో వీటితో పోటీ పడే అవకాశాలు కూడా తక్కువే అని చెప్పాలి. మరి ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :