ఆఫీషియల్ : మెగాస్టార్ తో మరోసారి తమన్నా ఫిక్స్.!

Published on Nov 9, 2021 2:00 pm IST


టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన మాస్ స్పీడ్ చూపిస్తున్నారు. “ఖైదీ 150” తర్వాత “సైరా” కోసం ఎక్కువ గ్యాప్ తీసుకున్న చిరు ఈసారి మాత్రం తన జెట్ స్పీడ్ తో కొత్త సినిమాలు కంప్లీట్ చేస్తున్నారు. ఆల్రెడీ “గాడ్ ఫాదర్” ని కంప్లీట్ చేస్తుండగా మరో భారీ సినిమా “భోళా శంకర్” కి కూడా ముహూర్తం ఫిక్స్ చేసేసారు.

ఇక ఈ సినిమాపైనే చిత్ర యూనిట్ ఇప్పుడు ఒక కీలక అప్డేట్ ని రివీల్ చేశారు. మొదటి నుంచి టాక్ గా వినిపిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నానే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించనున్నట్టు చిత్ర యూనిట్ అధికారిక అప్డేట్ ఇచ్చారు. గతంలో ఈ ఇద్దరు సైరా లో నటించిన సంగతి తెలిసిందే.

అలాగే ఈ చిత్రం ముహూర్తం వచ్చే 11న ఉదయం 7 గంటల 45 నిమిషాలకు చేస్తున్నట్టు మరోసారి ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో కీర్తీ సురేష్ చిరు కి సోదరి పాత్రలో నటిస్తుండగా మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ మెగా మాసివ్ ప్రాజెక్ట్ ని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More