టీఆర్ఫీ రేటింగ్స్ లో దమ్ము చూపించిన ‘జయ జానకి నాయక’ !
Published on Dec 7, 2017 2:00 pm IST

బెల్లంకోడం సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ లు జంటగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను రూపొందించిన ‘జయ జానకి నాయక’ చిత్రం బాక్సాఫీస్ పరంగా మంచి విజయాన్ని అందుకోవడమే గాక టీవీ టీఆర్ఫీ రేటింగ్స్ లోను దమ్ము చూపించింది. గత నెల నవంబర్ 25 న స్టార్ మాలో సాయంత్రం 5 గంటల 30 నిముషాలకు ప్రసారమైన ఈ చిత్రం ప్రకారం 14.6 టీఆర్ఫీ రేటింగ్స్ ను సొంతం చేసుకుంది.

దీంతో చిత్ర శాటిలైట్ హక్కుల్ని కొన్న స్టార్ మాకు ఈ సినిమా లాభదాయకంగా మారింది. సినిమాలో బోయపాటి మార్క్ యాక్షన్ తో పాటు ఎమోషన్ కూడా నిండుగా ఉండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను ఆదరించారు. ఇక అదే రోజున జెమినీ టీవీలో ప్రసారమైన అల్లరి నరేష్ చిత్రం ‘మేడ మీద
అబ్బాయి’ 7.1 టీఆర్ఫీ రేటింగ్ ను సాధించింది.

 
Like us on Facebook