ఆసక్తికరమైన పాయింట్ తో వస్తున్న తమిళ స్టార్ !
Published on Oct 26, 2017 10:52 am IST

“రంగం” సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో జీవ తాజాగా ‘కీ’ సినిమాలో నటిస్తున్నాడు. కొత్త దర్శకుడు కలీస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నిక్కీ గల్రాని హీరోయిన్ గాను రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలోను నటిస్తున్నారు. సైకాలజికల్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా సైబర్ క్రైమ్ నేపథ్యంలో సాగుతుంది.

తాజాగా సంచలనం సృష్టించిన బ్లువెల్ గేమ్ గురించి మనందరికీ తెలుసు. ఆ గేమ్ బారినపడి చాలా మంది బలాన్మరణాలకు పాల్పడ్డారు కూడ. ప్రస్తుతం సమాజంలో బ్లువెల్ గేమ్ కంటే అతి ప్రమాదకరమైన ఒక ఆట ఆడబోతున్నారట, అదేంటో ఈ సినిమాలో చూపించారు దర్శకుడు. సైబర్ క్రైం గురించి ప్రధానంగా చర్చించిన ఈ సినిమా ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది. త్వరలోనే ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు.

 
Like us on Facebook