తారక్ కోసమే చేశానంటున్న కాజల్ !


ప్రస్తుతమున్న స్టార్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ మంచి మంచి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. విజయ్ 61 పాటు అజిత్ ‘వివేగం’, రానా ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాల్లో నటిస్తున్న ఆమె ‘క్వీన్’ తమిళ రీమేక్లో సైతం నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇవి కాకుండా ఆమెకు తెలుగు, తమిళం, హిందీల్లో పలు స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసే ఆఫర్లు కూడా వస్తున్నాయి. కానీ కాజల్ మాత్రం ఆ పాటల్లో ఎలాంటి ఇంపార్టెన్స్ కనిపించకపోవడం వలన వాటిని రిజెక్ట్ చేశానని చెప్పుకొచ్చారు.

మరి ఎన్టీఆర్ సూపర్ హిట్ సినిమా ‘జనతా గ్యారేజ్’ లో స్పెషల్ సాంగ్ ఎందుకు చేశారాన్న ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ ఆ పాటకు సినిమాలో ప్రాముఖ్యత ఉండటం వలన మరీ ముఖ్యంగా తారక్ తో తనకున్న అనుబంధం వలన ఆ పాట చేశానని చెప్పారు. అంతేగాక భవిష్యత్తులో స్ఫూర్తిదాయకంగా, ఛాలెంజింగా ఉండే పాత్రలు చేయాలనుంది కూడా అన్నారు.