మిస్టరీ ఎలిమెంట్స్ నిండిన కథతో కళ్యాణ్ రామ్ సినిమా !

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ‘ఎం.ఎల్.ఏ’, ‘నా నువ్వే’ వంటి సినిమల్లో నటిస్తున్న సంగతి విధితమే. ఇటీవలే విడుదలైనా ఏ చిత్ర టీజర్లు బాగానే ఆకట్టుకున్నాయి. ఈ రెండు సినిమాలు ఈ వేసవిలోనే విడుదలకానున్నాయి. ఇలా ఈ ప్రాజెక్ట్స్ ఇంకా పూర్తికాకముందే ఈ నందమూరి హీరో మరో కొత్త పేరుకు సైన్ చేసినట్టు తెలుస్తోంది.

ఈ చిత్రం రెగ్యులర్ కమర్షియల్ జానర్లలా కాకుండా మిస్టరీ థ్రిల్లర్ గా ఉంటుందని వినికిడి. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు విజయ్ మద్దల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ దర్శకుడు కథను మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తయారుచేయడంతో కళ్యాణ్ రామ్ ఈ కథకు ఒప్పుకున్నారట. ‘ఎం.ఎల్.ఏ’ చిత్రాన్ని నిర్మిస్తున్న భరత్ చౌదరి, కిరణ్ రెడ్డిలు ఈ ప్రాజెక్టుని కూడా నిర్మించనున్నారు.