ఆ చిత్రం యొక్క పూర్తి హక్కుల్ని చేతిలోకి తీసుకున్న కమల్ హాసన్ !

23rd, April 2017 - 11:34:22 AM


2013లో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన ‘విశ్వరూపం’ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో వేరే చెప్పనక్కర్లేదు. అందులో కమల్ నటనకు గాను ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. ఆ చిత్రం విడుదలైన కొద్దిరోజులకే దానికి సీక్వెల్ తీస్తానని కమల్ ప్రటించారు. దాదాపు షూటింగ్ చాలా వరకు పూర్తి చేశారు కూడ. కానీ కొన్ని రాజకీయ, ఇతర కారణాల వలన ఆ సీక్వెల్ 2013లోనే ఆగిపోయింది. ఇక ఆ ప్రాజెక్ట్ లేనట్టే అని అందరూ అనుకున్నారు.

ఇప్పుడు ఆ ప్రాజెక్టునే పూర్తి చేసేందుకు కమల్ నడుం బిగించారు. సినిమాకునం అడ్డంకులన్నింటికీ ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. అందులో భాగంగానే కొద్ది రోజుల క్రితమే తన రెమ్యునరేషన్ ను పూర్తిగా వదులుకుంటున్నట్టు తెలిపిన కమల్ తాజాగా ఇన్నాళ్లు సినిమా నిర్మాణ భాధ్యతల్ని చూస్తునాను నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ నుండి ఆ భాధ్యతల్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంటున్నానని, ఇకపై తన రాజ్ కన్మల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ఆ పనులు చూస్తుందని తెలిపారు. అంతేగాక సినిమాను ఈ 2017 లోనే రిలీజ్ చేస్తానని కూడా తెలిపారు.