షూటింగ్ పూర్తి చేసుకున్న కార్తీ సినిమా
Published on Apr 25, 2018 5:35 pm IST

యంగ్ హీరో కార్తీ ఇటీవల ఖాకీ చిత్రం తో మనముందకు వచ్చిన విషయం తెలిసిందే. కార్తీ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఆ సినిమా తెలుగులోను మంచి విజయాన్ని అందుకుంది. కాగా ప్రస్తుతం కార్తీ ఒక గ్రామీణ నేపథ్యంలో సాగే తమిళ చిత్రం కడైకుట్టి సింగంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన ఒక రైతుగా కనపడనున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రానికి సంబంధించి అందుతున్న లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని యూనిట్ జూన్ లో విడుదలకు సన్నాహాలు చేస్తోందట. ఈ చిత్ర కథ బాగా నచ్చడంతో, ఇందులో రైతుగా నటించడానికి కార్తీ కొంతమేర వ్యవసాయం ఎలా చేయాలో నేర్చికున్నారట. అఖిల్ ఫేమ్ సయేషా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు..

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 

వీక్షకులు మెచ్చిన వార్తలు