అల్లు అర్జున్‌కి అరుదైన బహుమతిని ఇచ్చిన అభిమాని..!

Published on Sep 29, 2021 11:21 pm IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళ, తమిళనాడులో కూడా భారీగానే అభిమానులు ఉన్నారు. అయితే ముఖ్యంగా కేరళలో బన్నీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ బన్నీ సినిమాలు భారీగానే వసూళ్లను రాబడుతుంటాయి. కేరళలో బన్నీని అభిమానులు ముద్దుగా మల్లు అర్జున్‌ అని పిలుచుకుంటారు. అయితే తాజాగా అల్లు అర్జున్‌కి ఓ కేరళ అభిమాని అరుదైన బహుమతిని ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు.

కేరళలో పుట్టి దుబాయ్‌లో ఉంటున్న రియాజ్‌ కిల్టన్ అనే వ్యక్తికి అల్లు అర్జున్ అంటే ఎనలేని అభిమానం. అయితే షూటింగ్‌ నిమిత్తం ఇటీవల యూఏఈ వెళ్లిన బన్నీని కిల్టన్‌ కలిశాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్కు 160 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన పిస్టల్ను రియాజ్‌ కిల్టన్ బహుమానంగా ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. అయితే అభిమాని ఇచ్చిన బహుమతికి బన్నీ కూడా ఒకింత ఆశ్చర్యపోయాడు.

సంబంధిత సమాచారం :