యశ్ కి అక్కడ పోటీనే లేదు…370 కోట్ల మార్క్ ను టచ్ చేసిన కేజీఎఫ్2!

Published on May 2, 2022 2:35 pm IST

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కేజీఎఫ్2. ఈ చిత్రం విడుదలైన తొలి రోజు నుండి అదే దూకుడును కొనసాగిస్తుంది. విడుదలైన అన్ని ఏరియాల్లోనూ, ముఖ్యంగా హిందీలో వసూళ్లు రాబట్టిన విధానం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సినిమా అద్భుతంగా దూసుకుపోతోంది.

లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ఈ చిత్రం హిందీలో 370 కోట్ల మార్క్‌ను దాటింది. వేగంగా 370 కోట్లకు చేరుకున్న చిత్రంగా కేజీఎఫ్2 నిలిచింది. జెర్సీ, హీరోపంతి 2 వంటి పెద్ద చిత్రాలకు యష్‌కి పోటీ లేదు కేజీఎఫ్ 2 ఖచ్చితంగా రాబోయే కొద్ది రోజుల్లో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. మరి ఈ సినిమా 400 కోట్ల మార్క్‌ను ఎప్పుడు అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :