బిగ్ షాక్: పైరసీ బారిన పడిన “కొండపొలం”..!

Published on Oct 10, 2021 2:15 am IST


మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొండపొలం’. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి మరియు రాజీవ్ రెడ్డిలు నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 8న విడుదలై మంచి టాక్‌నే తెచ్చుకుంది. అయితే ఈ సినిమా విడుదలై ఒక్కరోజు కూడా గడవకముందే చిత్రబృందానికి షాక్ ఇచ్చింది తమిళ రాకర్స్.

అయితే కొండపొలం సినిమా అప్పుడే పైరసీ బారిన పడింది. మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా కలెక్షన్లను కూడా బాగానే రాబడుతుంది. అయితే ‘కొండపొలం’ సినిమా పైరసీ బారిన పడడం నిజంగా షాకింగ్ అని, ఈ ఎఫెక్ట్ కొంతవరకైనా సినిమా కలెక్షన్లపై పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :