సమీక్ష : కురుక్షేత్రం – థ్రిల్ లేని క్రైమ్ థ్రిల్లర్

Published on Sep 21, 2018 10:36 pm IST
Kurukshethram movie review

విడుదల తేదీ : సెప్టెంబర్ 21, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : అర్జున్‌, సుమన్, సుహాసిని, ప్రసన్న, వైభవ్, వరలక్ష్మి శరత్ కుమార్

దర్శకత్వం : అరుణ్ వైద్యనాథన్

నిర్మాతలు : ఉమేష్, సుధాన్ సుందరం, జయరాం, అరుణ్ వైద్యనాథన్

సంగీతం : యస్ నవీన్

సినిమాటోగ్రఫర్ : అరవింద కృష్ణ

ఎడిటర్ : సతీష్ సూర్య

అరుణ్ వైద్యనాథన్ దర్శకత్వంలో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కురుక్షేత్రం’. ఇది అర్జున్ కు 150వ చిత్రం కావడం విశేషం. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. మరి ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

రంజిత్ కాళిదాస్ (అర్జున్ ) ఒక డి.ఎస్.పి. ఎలాంటి త్రీవ్రమైన కేసులనైనా పరిష్కరించడంలో దిట్ట. చాలా చక్యంగా రంజిత్ కాళిదాస్ కేసులను డీల్ చేస్తాడు. కాగా ఒక రోజు రంజిత్ కాళిదాస్ తన టీం ( ప్రసన్న , వరలక్ష్మి ) లతో కలిసి ఒక హై ప్రొఫైల్ కేసు అయిన, వరుస మర్డర్ హత్యల కేసును ఛేదించడానికి సిద్దమవుతారు.

ఈ క్రమంలో దోషులు క్లూస్ ఇచ్చి మరి హత్యలు చేస్తూ.. రంజిత్ కాళిదాస్ కు మరియు పోలీసులకు సవాల్ విసురుతారు. ఇంతకీ ఈ వరుస హత్యల హంతకుడు ఎవరు ? ఈ హత్యలను ఎందుకు చేయాలనుకుంటాడు? ఈ కేసును రంజిత్ కాళిదాస్ ఆయన టీం ఎలా ఛేదిస్తుంది ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ఒక డి.ఎస్.పి గా నటించిన అర్జున్, తన నటనతో సినిమాకే హైలైట్ గా నిలుస్తారు. ఈ ఏజ్ లో కూడా చక్కని ఫిజిక్ అండ్ ఫిట్ నెస్ తో, చాలా స్టైలిష్ స్క్రీన్ ప్రజెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆయన కాకుండా ఈ పాత్ర ఎవరు చేసిన అంత బలంగా అనిపించదు. సినిమా మొత్తం తన భుజాల ఫై వేసుకొని రంజిత్ కాళిదాస్ పాత్రకు పూర్తి న్యాయం చేశారు అర్జున్.

ఇక ప్రసన్న మరియు వరలక్ష్మి లు క్రైమ్ బ్రాంచ్ టీం సభ్యులుగా కరెక్ట్ గా సెట్ అయ్యారు. ఆ పాత్రల్లో వారి నటన కూడా బాగుంది. చందన పాత్రలో నటించిన అమ్మాయి కూడా బాగా చేసింది. సైకో కిల్లర్ గా నటించిన తమిళ నటుడు డీసెంట్ గా నటించాడు. ఇక సుమన్ , సుహాసిని జంట స్క్రీన్ పైన చూడడానికి గౌరవప్రదంగా అనిపించింది.

ఇక వైభవ్ లాంటి నటులు చాలా చక్కగా నటించారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు అరుణ్ వైద్యనాథన్ మంచి స్టోరీ థీమ్ తీసుకున్నారు. కానీ బాగా స్లో నేరేషన్ తో, కన్వీన్స్ కానీ ట్రీట్మెంట్ తో సాగతీస్తూ సినిమాని ఆసక్తికరంగా మలచలేకపోయారు. అర్జున్ లాంటి యాక్షన్ హీరోని పెట్టుకొని కూడా సినిమా మీద ప్రేక్షకుడికి ఇంట్రస్ట్ పుట్టించలేకపోయరు. కొన్ని సన్నివేశాల్లో ఇంట్రస్ట్ పెంచే స్కోప్ ఉన్నపటికీ దర్శకుడు ఆ ‘వే’ని వదిలేసి అనవసరమైన సీన్స్ తో సినిమాని నింపేశాడు.

ఇక సినిమా నిండా కాన్ ఫ్లిట్, కంటెంట్ ఉన్నట్లే అనిపిస్తోంది. కానీ ఎక్కడా ఆ కాన్ ఫ్లిట్ గాని, కంటెంట్ గాని ఎలివేట్ అయినట్లు కనిపించదు. వీటికి తోడు బలం లేని కథలో బలహీన పాత్రలను సృష్టించి, అవి ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాయో దర్శకుడికే అర్ధం కానీ విధంగా తెరకెక్కించినట్లు అనిపిస్తోంది. ముఖ్యంగా డిసిపి టీం కావొచ్చు వైభవ్ కావొచ్చు వారికీ సీన్స్ కి సరైన ప్లో కూడా లేదు.

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక విభాగానికి వస్తే.. దర్శకుడు అరుణ్ వైద్యనాథన్ మంచి స్టోరీ ఐడియా తీసుకున్నారు. కానీ ఆ ఐడియాని పూర్తిగా వాడుకోలేకపోయారు. ఆయన సరైన కథనాన్ని రాసుకోవడంలో విఫలమయ్యారు.

సంగీత దర్శకుడు యస్ నవీన్ అందించిన నేపధ్య సంగీతం బాగుంది. కీలక సన్నివేశాల్లో ఆకట్టుకున్నేలా ఆయన మ్యూజిక్ ని ఇచ్చారు. సతీష్ సూర్య ఎడిటింగ్ సినిమాకి అనుగుణంగా సాగుతుంది. విసిగించే సీన్స్ ట్రీమ్ చేసి ఉంటే బాగుండేది.

నిర్మాతలు ఉమేష్, సుధాన్ సుందరం, జయరాం, అరుణ్ వైద్యనాథన్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కథకు అవసరమైనంత ఖర్చు పెట్టారు.

తీర్పు :

బహుభాషా హీరో అయిన యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కురుక్షేత్రం’. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మాత్రం విఫలమైంది. రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ గా సాగుతూ విసిగిస్తోంది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు బాగున్నా.. మిగిలిన సన్నివేశాలను కూడా దర్శకుడు అదే ఫిల్ తో మలచలేకపోయాడు. ఇక సెకాండాఫ్ లో వచ్చే సన్నివేశాలు చాలా వరకు నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టిస్తాయి. కాకపోతే క్రైం యాక్షన్‌ ని ఇష్టపడే వారు ఈ చిత్రాన్ని ఒకసారి చూడొచ్చు.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :