కమల్ హాసన్ “విక్రమ్” లేటెస్ట్ అప్డేట్!

Published on May 8, 2022 10:25 pm IST


స్టార్ హీరో కమల్ హాసన్, విజయ్ సేతుపతి మరియు ఫాహద్ ఫజిల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ చిత్రం విక్రమ్. ఈ బహుభాషా చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన మరో అప్డేట్ ను చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించడం జరిగింది.

ఈ చిత్రం నుండి మొదటి పాటను మే 11, 2022 న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చిన్న గ్లింప్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. కమల్ హాసన్ మరియు ఆర్ మహేంద్రన్ నిర్మిస్తున్న ఈ చిత్రంను జూన్ 3, 2022 న వివిధ భాషలలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ మల్టీ స్టారర్ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :