థియేటర్ రిలీజ్ కోసం ఎదురుచేస్తోన్న హీరో !

Published on Nov 1, 2020 12:41 am IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ ‘రెడ్’ మొదట ఏప్రిల్ సెకెండ్ వీక్ లో విడుదల చేయాలనుకున్నా.. కరోనా దెబ్బకు పోస్ట్ ఫోన్ అయింది. అయితే ఈ సినిమాని డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ చేయటానికి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ భారీ ఆఫర్లు ఇస్తున్నా… మేకర్స్ మాత్రం నో చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్తితులను బట్టి సంక్రాంతికి నేరుగా థియేటర్లు ఓపెన్ చేసే అవకాశం ఉన్నందున, రామ్ టీమ్ ఏటువంటి ఓటీటీ ఆఫర్స్ తీసుకురావద్దని స్పష్టం చేస్తోందట. కాగా సెన్సేషనల్‌ బ్లాక్‌ బస్టర్‌ ‘ఇస్మార్ట్ శంకర్‌’ తర్వాత రామ్‌ హీరోగా చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రాన్ని సంక్రాంతికి నేరుగా థియేటర్ లో రిలీజ్ చేయాలనేది రామ్ ప్లాన్.

తిరుమల కిషోర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా సమీర్‌ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఇక ఈ కరోనా మహమ్మారి దెబ్బకు సినిమాల రిలీజ్ ల పరిస్థితి గందరగోళంలో పడింది. ఎప్పుడో సమ్మర్ లో రావాల్సిన సినిమాలే మొత్తం పోస్ట్ ఫోన్ అయ్యాయి. ఇప్పుడు దసరా సీజన్ కూడా పోవడంతో ఇక చేసేది ఏమిలేక స్టార్ హీరోలు కొంతమంది నేరుగా డిజిటల్ రిలీజ్ కి వెళ్లిపోతున్నా.. రామ్ లాంటి మరికొంతమంది హీరోలు మాత్రం థియేటర్ల రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More