“మ్యాడ్” టీవీ ప్రీమియర్ కి డేట్ అండ్ టైమ్ ఫిక్స్!

“మ్యాడ్” టీవీ ప్రీమియర్ కి డేట్ అండ్ టైమ్ ఫిక్స్!

Published on Jan 6, 2024 1:13 AM IST


సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉదయన్ ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ మ్యాడ్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది.

ప్రముఖ టీవీ ఛానల్ అయిన ఈటీవీ లో సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 15 వ తేదీన మధ్యాహ్నం 12:30 గంటలకి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు