డబ్బింగ్లో బిజీ బిజీగా మహేష్ బాబు !
Published on Jul 31, 2017 3:43 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటే మురుగదాస్ తో చేస్తున్న ‘స్పైడర్’ పనుల్ని కూడా చక్కబెడుతున్నారాయన. ప్రస్తుతం ఈ సినిమా తాలూకు డబ్బింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మహేష్. ఇప్పటికే ఒకసారి వాయిదాపడిన ఈ చిత్రాన్ని ఇకపై ఆలస్యం చేయకుండా ప్రేక్షకుల్లకు అందివ్వాలని గ్యాప్ లేకుండా పనిచేస్తున్నారు మహేష్.

ఇక తెలుగుతో పాటు తమిళంలో కూడా రూపొందుతున్న ఈ చిత్రం స్పై థ్రిల్లర్ గా ఉండనుండగా కొరటాల చిత్రం సామాజిక నైపథ్యంలో సాగేదిగా ఉండనుంది. ఈ రెండు చిత్రాలపై అభిమానుల్లో భారీ స్థాయి అంచనాలున్నాయి. సెప్టెంబర్ 27 న ‘స్పైడర్’ విడుదలవుతుండగా ‘భరత్ అనే నేను’ 2018 ఆరంభంలో రానుంది. వీటి తర్వాత మహేష్ వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ చేయనున్నారు.

 
Like us on Facebook