మహేష్-మురుగదాస్ సినిమా లేటెస్ట్ అప్‌డేట్స్
Published on Aug 1, 2016 8:39 pm IST

mahesh-and-murugu-das
సూపర్ స్టార్ మహేష్ – దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్‌ల కాంబినేషన్‌లో ఓ సినిమా గత శుక్రవారం నుంచే సెట్స్‌పైకి వెళ్ళిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ హైద్రాబాద్‌లో జరుగుతోంది. ఇక నేటినుంచి పూర్తిగా రాత్రి సమయంలోనే షూటింగ్ జరపనున్నట్లు టీమ్ దగ్గర్నుంచి సమాచారం అందుతోంది. వారం రోజుల పాటు రాత్రుల్లోనే షూటింగ్ జరపనున్నారు. మహేష్ కూడా ఇప్పటికే తన కొత్త లుక్‌తో సెట్స్‌లో జాయిన్ అయిపోయారు.

సౌతిండియన్ లెవెల్లో తిరుగులేని పాపులారిటీ ఉన్న హీరో, దర్శకుడు కలిసి చేస్తోన్న సినిమా కావడంతో సెట్స్‌పైకి వెళ్ళకముందునుంచే ఈ సినిమా మంచి ఆసక్తి రేకెత్తిస్తూ వస్తోంది. ఓ సామాజిక అంశంపై నడిచే ఈ సినిమాను ముంబై, గుజరాత్, పూణే, చెన్నై, హైద్రాబాద్‌లలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ సినిమాను ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. మహేష్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు సంతోష్ శివన్, హరీస్ జైరాజ్ లాంటి టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు.

 
Like us on Facebook