యూఎస్ లో భారీ షూట్ ప్లాన్ చేసిన మహేష్ !
Published on Oct 30, 2017 3:11 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ షూటింగ్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని రోజుల పాటు ఈ షూట్ కు బ్రేక్ ఇచ్చి వేరే షూటింగ్లో మహేష్ పాల్గొననున్నారట. అయితే అది సినిమా షూటింగ్ కాదు యాడ్ షూట్. మహేష్ ప్రముఖ కోలా బ్రాండ్ థమ్స్ అప్ కు ఇండియా తరపున కొన్నేళ్లుగా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

దీనికి సంబందించిన యాడ్ షూట్ కోసం మహేష్ యూఎస్ వెళ్లనున్నారు. యూఎస్ లోని లాస్ వేగాస్ లో ఈ షూట్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 3 రోజుల పాటు ఈ షూట్ జరగనుంది. దీనికోసం నవంబర్ 7న మహేష్ యూఎస్ వెళ్లనున్నాడు. ఆ షూట్ అనంతరం ఇండియా తిరిగొచ్చి కొరటాల సినిమా చిత్రీకరణలో జాయిన్ అవుతారు మహేష్.

 
Like us on Facebook