మహేష్ ‘స్పైడర్’ పూర్తయ్యేది ఎప్పుడంటే !
Published on May 24, 2017 3:52 pm IST


మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘స్పైడర్’ చిత్రం వాయిదాపడిన సంగతి తెలిసిందే. అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తికాకపోవడంతో వలనే ఆ ఆలస్యానికి కారణం. కానీ అభిమానులు మాత్రం వాయిదా పడితే పడింది కానీ కొత్త డేట్ అయినా చెప్పలేదే అని కాస్తంత నిరుత్సాహానికి లోనవుతున్నారు. తాజాగా సినీ సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం 2 కల్లా టాకీ పార్ట్ ను పూర్తి చేసుకుంటుందట.

అలాగే విదేశాల్లో షూట్ చేయాలనుకుంటున్న పాటలు కూడా ఆలోపే పూర్తై ఇప్పటికే జరుగుతున్న పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకాస్త వేగం అందుకుంటుందని తెలుస్తోంది. ఇకపోతే సెప్టెంబర్ ఆఖరులో రిలీజ్ చేయాలని భావిస్తున్న ఈ చిత్రం మహేష్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా చెప్పబడుతోంది. ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.

 
Like us on Facebook