తమిళంలో రేపు రిలీజ్ కానున్న మహేష్ బాబు సినిమా !
Published on Mar 9, 2018 8:34 am IST


‘బాహుబలి’ తర్వాత తెలుగు సినిమాలకు తమిళనాట క్రేజ్ మరింతగా పెరిగింది. ఒకవైపు కొందరు స్టార్ హీరోల కొత్త సినిమాలు తెలుగుతో పాటు తమిళంలో కూడ రూపొందటం, ఇంకొన్ని సినిమాల్ని ఏకకాలంలో డబ్ చేసి రిలీజ్ చేయడం జరుగుతుంటే మరోవైపు స్టార్ హీరోల పాత సినిమాలు సైతం ఇప్పుడు డబ్ అవుతున్నాయి.

తాజాగా మహేష్ బాబు కెరీర్లో వైవిధ్యమైన చిత్రంగా చెప్పుకునే ‘టక్కరి దొంగ’ సినిమాను ‘వెట్రి వీరన్’ పేరుతో తమిళంలోకి అనువదించి రేపు 10వ తేదీన విడుదలచేయనున్నారు. 2002లో వచ్చిన ఈ చిత్రాన్ని జయంత్ సి పరాన్జీ డైరెక్ట్ చేశారు. మరోవైపు రామ్ చరణ్ యొక్క ‘నాయక్’ కూడ ‘రౌడీ నాయక్’ పేరుతో తమిళంలోకి అనువదింపబడుతోంది.

 
Like us on Facebook