సందడి మొత్తం మెగా హీరోలదే

Published on Nov 24, 2020 8:14 pm IST

తెలంగాణలో థియేటర్లు తెరుచుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. థియేటర్ యాజమాన్యాలు ఏర్పాట్లను మొదలుపెట్టుకుంటున్నాయి. 50 శాతం ఆక్యుపెన్సి అనే సరికి టికెట్ ధరలు గిట్టుబాటవుతాయో కాదోననే అనుమానంతో ఉన్న డిస్ట్రిబ్యూషన్ వర్గాలు ప్రభుత్వం ధరలను సవరించుకునే అవకాశం ఇవ్వడంతో ఊపిరిపీల్చుకున్నాయి. అంటే ఇంతకు ముందు రోజుల్లో కంటే ఇకపై టికెట్ ధరలు ఎక్కువగానే ఉంటాయి. అయినా సినీ లవర్స్ ఓకే అంటున్నారు. థియేటర్లో సినిమా అనుభూతిని పొంది ఏడు నెలలు కావడంతో థియేటర్లకు రావడానికి ఆసక్తిగా ఉన్నారు.

ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పటికిప్పుడు థియేటర్లలో విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాలేమిటి అనేది చూసుకుంటే మెగా హీరోల సినిమాలు రెండు ప్రముఖంగా కనిపిస్తున్నాయి. సాయి తేజ్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ అన్ని పనులు ముగించుకుని సిద్దంగా ఉంది. డిసెంబర్లోనే విడుదలని ప్రకటించారు. అలాగే పంజా వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమా ‘ఉప్పెన’ కూడ విడుదల కోసం ఎదురుచూస్తోంది. మొదట ఒటీటీకే వెళ్లాలని అనుకున్నా పెద్దల సలహ మేరకు థియేటర్లలోనే విడుదలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రం కూడా మోస్ట్లీ డిసెంబర్లోనే ఉండొచ్చు. రెండు నెలల క్రితం వరకు చాలానే సినిమాలున్నా ఈమధ్య ఎక్కువగా ఓటీటీల్లోకి వచ్చేశాయి. కాబట్టి విడుదలవ్వాల్సిన సినిమాల కౌంట్ తగ్గిపోయింది.

సంబంధిత సమాచారం :

More