“వాల్తేరు వీరయ్య” కోసం మెగా పవర్ ప్రెజెన్స్

Published on Jan 27, 2023 2:00 pm IST

మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ సాలిడ్ హిట్ చిత్రం “వాల్తేరు వీరయ్య”. మెగాస్టార్ చిరంజీవి ముందే చెప్పి మరీ చిత్రంతో తన కెరీర్ లో మరో లాంగ్ రన్ తో కూడిన సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నారు. మరి మాస్ మహారాజ రవితేజ కూడా నటించిన ఈ చిత్రంని దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించగా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర వాల్తేరు వీరయ్య వీర విహారం మరో రేంజ్ లో ఉంది.

దీనితో చిత్ర యూనిట్ సినిమా సక్సెస్ కి గాను భారీ సక్సెస్ మీట్ ని ఈ జనవరి 28న హనుమకొండ లో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ గ్రాండ్ ఈవెంట్ కి గాను మేకర్స్ అయితే మెగాపవర్ ప్రెజెన్స్ ని ప్లాన్ చేస్తున్నట్టుగా లేటెస్ట్ టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ ఈవెంట్ కి గాను చిత్ర యూనిట్ తో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమా సక్సెస్ లో భాగం కానున్నట్టుగా అధికారికంగా వచ్చేసింది. దీనితో రేపు మెగా ఫ్యాన్స్ మంచి ట్రీట్ అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందివ్వగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :