మెగాస్టార్ సర్జరీ వెనుక కారణం అదే !

Published on Oct 18, 2021 8:00 am IST

మెగాస్టార్ చిరంజీవి కుడి చేతికి సర్జరీ అయిన సంగతి తెలిసిందే. అయితే, చిరుకు ఏం అయింది ? ఎందుకు మెగాస్టార్ సర్జరీ చేయించుకున్నారు ? అంటూ అభిమానులు సోషల్ మీడియాలో వరుస కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరు తన సర్జరీ గురించి మాట్లాడుతూ.. ‘ గత కొన్ని రోజులుగా నా కుడి చేతితో ఏ పని చేయాలన్నా నొప్పిగా, తిమ్మిరిగా అనిపిస్తోంది.

దాంతో డాక్టర్స్ ను సంప్రదించాను. అయితే చెక్ చేసిన డాక్టర్స్ చేతి మణికట్టు దగ్గరల్లో ఉన్న నరం మీద ఒత్తిడి పడిందట. అందువల్లే అలా నొప్పి అనిపిస్తుందని చెప్పారు. దీన్ని కార్పల్‌ టన్నెల్‌ సిండ్రోమ్‌ అంటారని సర్జరీ చేశారు. సర్జరీ అనంతరం 15 రోజులు విశ్రాంతి తీసుకోమన్నారు. అందుకే, ‘గాడ్‌ ఫాదర్‌’ షూటింగ్ కు గ్యాప్ ఇచ్చాను. నవంబర్‌ 1న మళ్లీ షూట్ లో జాయిన్ అవుతాను’ అంటూ చిరంజీవి తెలిపారు.

సంబంధిత సమాచారం :

More