స్మాల్ స్క్రీన్ పై మెగాస్టార్ “ఇంద్ర” కి అదే క్రేజు, అదే మోజు..

స్మాల్ స్క్రీన్ పై మెగాస్టార్ “ఇంద్ర” కి అదే క్రేజు, అదే మోజు..

Published on Jan 19, 2024 7:02 AM IST

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన ఈ రికార్డ్ బ్రేకింగ్ చిత్రాల్లో దర్శకుడు బి గోపాల్ తో చేసిన మొట్ట మొదటి ఫ్యాక్షన్ సబ్జెక్ట్ “ఇంద్ర” కోసం ఆడియెన్స్ కి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఇక ఈ సినిమాకి మెగా ఫ్యాన్స్ లో కానీ టాలీవుడ్ చరిత్రలో కానీ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది.

మరి ఈ చిత్రం ఎన్నో ఏళ్ల తర్వాత స్మాల్ స్క్రీన్ పై మళ్లీ టెలికాస్ట్ అయ్యింది. గత కొన్ని రోజులు కితం జీ సినిమాలు లో ఇంద్ర రీ టెలికాస్ట్ కాగా ఈ చిత్రానికి సాలిడ్ టీఆర్పీ నమోదు అయ్యింది. ఇక ఈ చిత్రానికి లేటెస్ట్ టెలికాస్ట్ లో 5.66 రేటింగ్ ని అందుకోవడం విశేషం.

ఈ రేంజ్ రేటింగ్ ప్రస్తుతం వస్తున్న పలు కొత్త చిత్రాల రేంజ్ లో ఉందని చెప్పాలి. దీనితో మాత్రం ఈ సినిమా పట్ల స్మాల్ స్క్రీన్ పై అదే క్రేజ్ ప్రేక్షకులలో అదే మోజు ఉందని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు అలాగే అశ్వనీదత్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు