మెగా అల్లుడు రెండో చిత్రం ఎప్పుడంటే ?

Published on Jul 15, 2018 5:00 pm IST

మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు ‘కళ్యాణ్ దేవ్’ హీరోగా విజేత చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు కళ్యాణ్ దేవ్ రెండవ చిత్రం ఎప్పుడు ? డైరెక్టర్ ఎవరు ? అని అప్పుడే మెగా అభిమానుల్లో చర్చ మొదలైపోయింది. ఐతే ఈ సారి కళ్యాణ్ దేవ్ మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తన తర్వాత సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.

కాగా గతంలో దర్శకుడు హరీష్ శంకర్, కళ్యాణ్ దేవ్ తో సినిమా చెయ్యటానికి ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. హరీష్ దగ్గర కళ్యాణ్ దేవ్ కి సరిపోయే కథ ఒకటి ఉందట. అలాగే మరో డైరెక్టర్ కూడా కళ్యాణ్ దేవ్ తో సినిమా చేయాలని ఇంట్రస్ట్ గా ఉన్నారని సమాచారం. అయితే మెగా కాపౌండ్ మాత్రం కళ్యాణ్ దేవ్ రెండువ సినిమాకి సంబంధించి అన్ని ఫైనలేజ్ చేసి పది రోజుల్లో అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనుందని సమాచారం.

సంబంధిత సమాచారం :

X
More