భీమ్లా నాయక్ పాట: జానపద గాయకుడికి భలే గుర్తింపు..!

Published on Sep 3, 2021 2:56 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం “భీమ్లా నాయక్”. నిన్న పవన్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాట మొదట్లో వచ్చే సాకీని జానపద గాయకుడు మొగులయ్య అద్భుతంగా ఆలపించాడు. అసలు ఈ మొగులయ్య ఎవరంటే నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట గ్రామానికి చెందినవాడు.

అయితే జానపద కథలనే నమ్ముకుని, 12 మెట్ల కిన్నెర కళాకారుడు గ్రామ గ్రామాన తిరుగుతూ కిన్నెర వాయిస్తూ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించేవాడు. అయితే భీమ్లా నాయక్ పాటలో పాడడం తనకు సంతోషంగా ఉందని మొగులయ్య అన్నాడు. అయితే ఇప్పటికైనా మొగులయ్యకు సరైన గుర్తింపు లభించిందని చాలా మంది అంటున్నారు.

సంబంధిత సమాచారం :