మోహన్ లాల్ ‘నెరు’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

మోహన్ లాల్ ‘నెరు’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Jan 18, 2024 11:27 PM IST

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మన తెలుగు ప్రేక్షకులకి కూడా ఎంతో సుపరిచితం. డబ్బింగ్ తో పాటు డైరెక్ట్ గా పలు తెలుగు సినిమాల్లో కూడా గతంలో ఆయన నటించి ఇక్కడి ఆడియన్స్ నుండి కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక ఆయన ప్రధాన పాత్రలో తాజాగా మలయాళంలో తెరకెక్కి మంచి విజయం అందుకున్న మూవీ నెరు. సలార్, డన్కి సినిమాలతో పాటు ఆడియన్స్ ముందుకి వచ్చినప్పటికీ అందరినీ ఆకట్టుకుంది ఈ మూవీ.

జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ మూవీ యొక్క ఓటిటి రిలీజ్ డేట్ తాజాగా ఫిక్స్ అయింది. కాగా ఈ మూవీని జనవరి 23న ప్రముఖ ఓటిటి మాధ్యమం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తమ ఆడియన్స్ ముందుకి తీసుకురానుంది. అయితే ఈ మూవీ ఇతర డబ్బింగ్ వర్షన్స్ లో అందుబాటులో ఉంటుందో లేదో అనే దాని పై మాత్రం ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ లేదు. ఇక నెరు మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 80 కోట్లకు పైగా గ్రాస్ ని సొంతం చేసుకుంది. ప్రియమణి, అనశ్వర రంజన్ కీలక పాత్రలు చేసిన ఈ మూవీని ఆశిర్వాద్ సినిమాస్ బ్యానర్ పై శాంతి ఆంటోనీ, ఆంటోనీ పెరంబవూర్ గ్రాండ్ గా నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు