“బిగ్ బాస్” హౌస్ లో ఈ ఇద్దరి మధ్య అంతకంతకూ దూరం!

Published on Oct 28, 2020 4:01 pm IST

మన తెలుగులో బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ ఇపుడు నాలుగో సీజన్లో కూడా అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ తో దూసుకుపోతుంది. మొదట్లో జస్ట్ ఓకే అనిపించినా ఇప్పుడు హౌస్ మేట్స్ నడుమ జరుగుతున్న డ్రామా అంతా కూడా ఆడియెన్స్ కు మరింత ఆసక్తిని నెలకొల్పుతుంది.

అయితే ప్రతీ సీజన్లో కూడా కొంతమంది హౌస్ మేట్స్ మంచి ఫ్రెండ్స్ గా మారిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాగే ఈసారి సీజన్లో కూడా వన్ ఆఫ్ ది టాప్ కంటెస్టెంట్ అయిన అభిజీత్ మరియు దేతడి హారికల మధ్య మంచి బాండింగ్ కుదిరింది.

కానీ నిన్నటి ఎపిసోడ్ లో మాత్రం జరిగిన చిన్న గొడవ చిలికి చిలికి గాలివాన అయ్యినట్టుగా తయారయ్యింది. నిన్న జరిగిన చిన్న పిల్లల టాస్క్ లో ఈ ఇద్దరి మధ్య చిన్న ఘర్షణ మొదలయ్యి అది కాస్తా గొడవగా మారింది. ఇపుడు ఇదే ఇంకా హౌస్ లో కొనసాగుతున్నట్టు అనిపిస్తుంది.

లేటెస్ట్ ప్రోమోలో కూడా అభిజిత్ మరియు హారికల మధ్య మాటలు ఇంకాఆ పెద్దవి చేసేలా ఉన్నాయి. మొత్తానికి ఈ ఇద్దరి బాండింగ్ మాత్రం ఇప్పుడు ఊహించాయి విధమైన మలుపు తిరిగింది. మరి ఈ ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉండనుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More