బ్రేకింగ్: ఆస్కార్ కి ఒరిజినల్ స్కోర్ విభాగం లో షార్ట్ లిస్ట్ అయిన “నాటు నాటు”

బ్రేకింగ్: ఆస్కార్ కి ఒరిజినల్ స్కోర్ విభాగం లో షార్ట్ లిస్ట్ అయిన “నాటు నాటు”

Published on Dec 22, 2022 7:04 AM IST

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించిన ఎపిక్ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. తాజాగా ఆస్కార్ అవార్డుల నామినేషన్ ప్రక్రియ లో ఈ చిత్రం నుండి ఒరిజినల్ స్కోర్ విభాగం లో నాటు నాటు షార్ట్ లిస్ట్ చేయబడింది. ప్రకటించిన 10 కేటగిరీలలో ఒకదానిలో RRR షార్ట్‌లిస్ట్ చేయబడి ఉండటం ఆసక్తికరమైన విషయం. సినీ ప్రేమికులకు ఇది సంతోషకరమైన వార్త.

ఈ చిత్రం ఉత్తమ సంగీతం (ఒరిజినల్ స్కోర్) విభాగంలో ఇతర 14 ఎంట్రీలతో నాటు నాటు పోటీ పడుతోంది. MM కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. అకాడమీ నామినేషన్లను జనవరి 24, 2023న ప్రకటిస్తుంది. భారతీయులు మాత్రమే కాకుండా, దాని కాన్సెప్ట్ మరియు కొరియోగ్రఫీ ట్రాక్‌ తో ప్రేమలో పడిన చాలా మంది పాశ్చాత్యులు, ఫైనల్ నామినేషన్లలో ట్రాక్‌ను చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 95వ అకాడమీ అవార్డులు మార్చి 12, 2023న ఓవేషన్ హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో జరుగుతాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు