మే 25 న ‘ఆఫీసర్’ గా రానున్న నాగార్జున !
Published on Feb 27, 2018 4:24 pm IST

రామ్‌గోపాల్ వర్మ నాగార్జునతో ఓ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది నవంబర్ 20వ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాకు ‘ఆఫీసర్’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 25 న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేద్దామని వర్మ, నాగార్జున మొదట్లో అనుకున్నారు. కాని శ్రీదేవి ఆకస్మిక మరణంతో టైటిల్ ప్రకటనను వాయిదా వేశారు.

సినీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాను మే 25న విడుదల చెయ్యబోతున్నట్లు తెలుస్తోంది. పోలీస్ నేపధ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మైరా సరీన్ అనే కొత్త అమ్మాయి నాగార్జున సరసన నటిస్తోంది. ఇకపోతే ఈ చిత్రం యొక్క మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ మరియు పైన ప్రస్తావించిన విడుదల తేదీని ఈరోజు సాయంత్రం 5 గంటలకు అధికారికంగా ప్రటించనున్నారు.

 
Like us on Facebook