కొత్త సినిమాని ప్రకటించిన నాగ చైతన్య !
Published on Mar 8, 2018 9:06 am IST

ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’, మారుతి సారథ్యంలో ‘శైలజా రెడ్డి అల్లుడు’ వంటి సినిమాల్లో నటిస్తున్న యంగ్ హీరో నాగ చైతన్య తన 17వ సినిమాను అనౌన్స్ చేశారు. ముందు నుండి అనుకుంటున్నట్టే ఈ చిత్రాన్ని శివ నిర్వాణ డైరెక్ట్ చేయనున్నాడు.

ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడీగా ఆయన సతీమణి, స్టార్ హీరోయిన్ సమంత నటించనుంది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడు మొదలువుతుంది, ఇతర నటీనటులెవరు అనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. తొలి చిత్రం ‘నిను కోరి’తో తనలోని వైవిధ్యాన్ని చూపిన దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రంలో ఎలాంటి భిన్నత్వాన్ని చూపిస్తారో చూడాలి.

 
Like us on Facebook