క్లాస్ డైరెక్టర్‌తో చైతూ సినిమా ఆగిపోయిందా?
Published on Nov 29, 2016 10:50 am IST

naga-chaitanya
అక్కినేని నాగచైతన్య ‘ప్రేమమ్’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ అన్న సినిమాలతో సినీ పరిశ్రమలో మళ్ళీ తన ఉనికి చాటుకొని హీరోగా దూసుకుపోతున్నారు. ఇక ఈ రెండు సినిమాలతో వచ్చిన క్రేజ్‌ను అలాగే కొనసాగించాలన్న ఉద్దేశంతో, చైతూ, ఇకపై వచ్చే సినిమాలన్నింటినీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కళ్యాణ్ కృష్ణతో ఒక సినిమా చేస్తూండగా, క్లాస్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణతో కొద్దిరోజుల క్రితం ఒక సినిమా అనౌన్స్ చేశారు. వారాహి చలన చిత్రం నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుందని అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది.

కాగా ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. కారణాలేవైనా ప్రస్తుతానికి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళే అవకాశం లేదని, వారాహి చలన చిత్రం బ్యానర్‌లోనే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నాగ చైతన్య సినిమా ఒకటి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. విలక్షణ సినిమాలతో దర్శకుడిగా తనదైన బ్రాండ్ సృష్టించుకున్న చంద్రశేఖర్, చైతూకి వినిపించిన కథ బాగా నచ్చిందని, కళ్యాణ్ కృష్ణ సినిమా పూర్తవ్వగానే వచ్చే ఏడాది ఈ సినిమా మొదలవుతుందని తెలుస్తోంది. అయితే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఏదీ లేకపోవడంతో ప్రస్తుతానికి ఇదంతా ప్రచారంగానే భావించాలి.

 
Like us on Facebook