నాగార్జున ‘నా సామిరంగ’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ ?

నాగార్జున ‘నా సామిరంగ’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ ?

Published on Feb 1, 2024 7:31 PM IST

కింగ్ అక్కినేని నాగార్జున, ఆషిక రంగనాథ్ హీరో హీరోయిన్స్ గా రాజ్ తరుణ్, అల్లరి నరేష్, మిర్నా, రుక్సార్ థిల్లాన్ ఇతర కీలక పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎమోషల్ మూవీ నా సామిరంగ. ఈ మూవీ ద్వారా తొలిసారిగా దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు యువ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ. ఇటీవల సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ మంచి సక్సెస్ సొంతం చేసుకుని ప్రస్తుతం ఇంకా థియేటర్స్ లో కొనసాగుతోంది.

విషయం ఏమిటంటే, తాజాగా నా సామిరంగ ఓటిటి రిలీజ్ డేట్ లాక్ అయినట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీని ప్రముఖ ఓటిటి మాధ్యమం డిస్నీ హాట్ స్టార్ వారు ఫిబ్రవరి 15న ప్రసారం చేయనున్నారని, అతి త్వరలో దీని పై అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా రానుందని తెలుస్తోంది. మరి థియేటర్స్ లో ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఈ మూవీ ఎంతమేర ఓటిటి లో అలరిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు