నాగార్జున, ఆర్జీవి సినిమాకు ముహూర్తం కుదిరింది !
Published on Nov 1, 2017 5:46 pm IST

1989లో వచ్చిన ‘శివ’ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలుసు. అప్పట్లో ఈ సినిమా రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా పెద్ద ట్రెండ్ ను సెట్ చేసింది. తాజాగా మళ్ళీ ఈ కాంబినేషన్ లో సినిమా మొదలు కాబోతుంది. ఈ మద్య నాగార్జునను కలిసి ఆర్జీవి ఒక పాయింట్ చెప్పడం, అది విన్న నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి. ఈ సినిమా ను నవంబర్ 20న మొదలు పెట్టబోతున్నట్లు ఆర్జీవి అధికారికంగా ప్రకటించాడు.

నాగార్జున తాజాగా ‘రాజు గారి గది 2’ సినిమాలో నటించాడు. ఆ సినిమా తరువాత మరే సినిమా ఒప్పుకోని నాగార్జున ఆర్జీవి దర్శకత్వంలో నటిస్తుండడం విశేషం. ‘శివ’ సినిమా మొదలైన అన్నపూర్ణ స్టూడియోలోనే ఈ సినిమా ప్రారంభం అవుతుండడం సంతోషంగా ఉందంటూ ఆర్జీవి ఫేస్ బుక్ ద్వారా ఈ శుభవార్తను తెలిపాడు.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook