నాగార్జున ‘ది ఘోస్ట్’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ టైం లాక్ …. !!

Published on Jul 8, 2022 10:00 pm IST

కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా గరుడా వేగా డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ ది ఘోస్ట్. సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని శ్రీ వెంక‌టేశ్వ‌రా సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంట‌ర్టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌ల‌పై సునీల్ నారంగ్‌, పుస్కురి రామ్‌మోహ‌న్ రావు, శ‌ర‌త్ మ‌రార్ కలిసి నిర్మిస్తున్నారు. దాదాపుగా షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీ బిగినింగ్ నుండే ఆడియన్స్ లో అక్కినేని ఫ్యాన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై బాగా అంచనాలు పెంచేసింది.

ఇక ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ టీజర్ ని రేపు రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన యూనిట్, దానిని రేపు సాయంత్రం 4 గం. 5 ని .లకు రిలీజ్ చేయనున్నామని కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. కిల్లింగ్ మెషిన్ అంటూ డిఫరెంట్ గా మూవీ పై మరింత అంచనాలు పెంచేస్తున్న ది ఘోస్ట్ టీమ్, వీలైనంత త్వరగా మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

సంబంధిత సమాచారం :