లొకేషనల్ లో కంటతడిపెట్టుకున్న నాని !

Published on Aug 17, 2018 2:30 pm IST

నాగార్జున, నాని కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘దేవదాస్’. ప్రస్తుతం ఈచిత్ర షూటింగ్ బ్యాంకాక్ లో జరుగుతుంది. ఇక ఈ సినిమాకు ఛాయాగ్రహణం అందిస్తున్న శాందత్ కేరళ వాసి. ఇటీవల కేరళలో కురుస్తున్న వర్షాలకు అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. శాందత్ కుటుంభం కూడా కేరళ లోనే ఉండడంతో అతని కుటుంభ సభ్యులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న శాందత్ కన్నీరుమున్నీరయ్యారు.

ఇక తన సినిమాటోగ్రాఫర్ సెట్ లో ఏడవడం చూసి నాని కూడా కన్నీరు పెట్టుకున్నారట. అక్కడివారి పరిస్థితిని తెలుసుకొని చాలా బాధపడ్డ వారు సురక్షితంగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నానని అలాగే వారి కోసం మనుకు తోచిన సాయం చేయాలని నాని ట్వీట్ చేశారు.

సంబంధిత సమాచారం :

X
More