రిపబ్లిక్ సినిమా పై హీరో నవదీప్ ఇంట్రస్టింగ్ కామెంట్స్!

Published on Oct 7, 2021 4:00 pm IST

సాయి ధరమ్ తేజ్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం రిపబ్లిక్. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకుల నుండి, అభిమానులు నుండి విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ చిత్రం పై ఇప్పటికే పలువురు ప్రముఖులు, అభిమానులు స్పందిస్తూ, కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ చిత్రం గురించి హీరో, నటుడు నవదీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తను సింధూరం చూసినప్పుడు తనకు 11 ఏళ్లు అని, ఆ వయసులో ఈ చిత్రం తనను ఎంతో కలచి వేసింది అంటూ చెప్పుకొచ్చారు. అప్పటి సమాజపు ప్రవర్తన గురించి అది నన్ను ఎలా కదిలించిందో ఇప్పటికీ గుర్తు ఉంది అని తెలిపారు. అదే విధంగా రిపబ్లిక్ నిన్న రాత్రి చూశా అని, అలానే అనిపించింది అంటూ చెప్పుకొచ్చారు. చాలా బావుంది అని, ఈ చిత్రం తో విజయం సాధించిన సాయి ధరమ్ తేజ్ కి, దేవాకట్టా కి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత సమాచారం :