నయన్ – విగ్నేష్ పెళ్లి డాక్యుమెంట్రీ పై నెట్ ఫ్లిక్స్ లేటెస్ట్ అప్డేట్.!

Published on Aug 9, 2022 4:25 pm IST


గత కొంత కాలం కితమే సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ హీరోయిన్ నయనతార అలాగే ప్రముఖ దర్శకుడు విగ్నేష్ శివన్ లు తమ ప్రేమని పెళ్లి పీఠలు ఎక్కించిన సంగతి తెలిసిందే. మరి ఎంతో అట్టహాసంగా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎందరో దిగ్గజాలు హాజరైన ఈ పెళ్లి విజువల్స్ ఇప్పటికీ గోప్యంగానే ఉన్నాయి.

మరి ఈ వేడుకలకి సంబంధించి దిగ్గజ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు ఈ పెళ్లి వేడుకలని ఓ డాక్యుమెంటరీ లా రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. ఇక లేటెస్ట్ గా అయితే దీనిపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందించారు.

నయన్ మరియు విగ్నేష్ లపై తమ బంధం కోసం చెప్తూ కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యల మధ్య ఈ డాక్యూమెంట్రీ టైటిల్ ని రివీల్ చేశారు. “నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్స్” అంటూ రివీల్ చేశారు. దీనితో ఈ గ్లింప్స్ వైరల్ గా మారింది. అలాగే దీనిపై డేట్ కూడా త్వరలోనే అనౌన్స్ కానుంది.

సంబంధిత సమాచారం :