అఫీషియల్ : “ది ఇండియా హౌస్” గా చరణ్, నిఖిల్ ల భారీ ప్రాజెక్ట్.!

Published on May 28, 2023 11:24 am IST

గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గానే యూవీ క్రియేషన్స్ నిర్మాత విక్రమ్ రెడ్డి తో కలిసి స్టార్ట్ చేసిన ప్రొడక్షన్ హౌస్ వి మెగా పిక్చర్స్ నుంచి అయితే ఈరోజు తమ మొదటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేస్తున్నట్టుగా తెలిపారు. మరి ఈ ప్రాజెక్ట్ అనౌన్సమెంట్ అయితే ఇప్పుడు వచ్చేసింది.

ఈ సాలిడ్ ప్రాజెక్ట్ లో యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించనుండగా కొత్త దర్శకుడు రామ్ వంశీ కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మరి ఈ చిత్రం నుంచి టైటిల్ అనౌన్స్ చేస్తూ ఓ ఇంట్రెస్టింగ్ వీడియోని కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. 1900 దశకం సమయంలో భారతదేశ చరిత్ర పుటల్లో లేని ఒక అధ్యాయాన్ని అయితే ఈ చిత్రంతో చేసే ప్రయత్నం మేకర్స్ చేస్తున్నారు.

ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో కనిపిస్తుండగా ఈ సినిమాకి “ది ఇండియా హౌస్” అనే టైటిల్ ని అయితే అనౌన్స్ చేశారు. మరి నిఖిల్ నటిస్తున్న ఈ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ చిత్రం అయితే ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే స్టార్ట్ కానుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు కూడా ఈ చిత్రంలో కొలాబరేట్ అయ్యారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :