సెన్సార్ పూర్తి చేసుకున్న కేశవ !


సుధీర్ వర్మ, నిఖిల్ సిద్దార్థల కలయికలో రూపుదిద్దుకుని త్వరలో విడుదలకానున్న చిత్రం ‘కేశవ’ పై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ట్రైలర్, టీజర్ తో సినిమా కాన్సెప్ట్ ఎంత భిన్నంగా ఉండబోతోందో చెప్పడంతో విడుదల తేదీ కోసం అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ తాలూకు పనులు పనులు పూర్తి చేసుకుని ఆడియో వేడుక కూడా జరుపుకున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాల్ని కూడా పూర్తిచేసుకుంది.

సెన్సార్ బోర్డు చిన్న చిన్న కత్తిరింపులతో ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు సుదీర్ వర్మ స్వయంగా తెలిపారు. నిఖిల్ సరసన రితు వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఇషా కొప్పికర్ ఒక కీలక పాత్రలో కనిపించనుంది. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమాకి సన్నీ.ఎంఆర్ సంగీతం అందించారు.