నిఖిల్ కొత్త సినిమా టైటిల్ !
Published on Mar 7, 2018 3:51 pm IST

నిఖిల్ నటించిన ‘కిరాక్ పార్టి’ మార్చి 16న ప్రేక్షకుల ముందుకురాబోతోంది. ఈ సినిమా తరువాత నిఖిల్ తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘కనితన్’ తెలుగు రీమేక్ లో నటించబోతున్నాడు. ఈ సినిమాలో నిఖిల్ రిపోర్టర్ గా కనిపించబోతున్నాడు. అర్జున్ సురవరం అనేది సినిమాలో అతని పాత్ర పేరు.

తాజా సమాచారం మేరకు ఈ సినిమా నిర్మాత ఠాగూర్ మధు ‘ముద్ర’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. ఈ టైటిల్ నే ఈ రీమేక్ కు పెట్టబోతున్నారట. ఈ చిత్రంలో నటించబోయే హీరోయిన్ ఎవరనేది తెలియాల్సి ఉంది. క్యాథరిన్, రష్మిక మందన్న వంటి వారి పేర్లు వినిపించాయి కానీ ఇంకా ఎవరు ఖరారు కాలేదని సమాచారం. సంతోష్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా సెంధిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యింది.

 
Like us on Facebook