ఎన్టీఆర్ బయోపిక్ పై స్పందించిన నిత్యా మీనన్ !
Published on Feb 20, 2018 1:09 pm IST

దర్శకుడు తేజ బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ‘ఎన్టీఆర్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం నటీ నటులను చాలా జాగ్రత్తగా ఎంపిక చేస్తున్నారు. ఈ ఎంపికలో భాగంగానే ఎన్టీఆర్ సతీమణి బసవతారకంగారి పాత్ర కోసం నటి నిత్యా మీనన్ ను సంప్రదించారట.

ఈ విషయాన్ని నిన్న జరిగిన ఒక ప్రెస్ మీట్లో నిత్యా మీనన్ వద్ద ప్రస్తావించగా ఆ విషయం నిజమేనని, కానీ కొన్ని కారణాల వలన ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించానని ఆమె అన్నారు. ఇకపోతే చేసిన ‘ప్రాణ’ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కనడ భాషల్లో విడుదలవుతుందని, కేవలం తన ఒక్క పాత్రతోనే నడిచే ఈ సినిమా ఇండియాలోనే సింక్ సౌండ్ తో రూపొందించబడిన తొలి సినిమా అని అన్నారు.

 
Like us on Facebook