‘నేనే రాజు నేనే మంత్రి’ తనకు చాలా స్పెషల్ అంటున్న కాజల్ !


స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం రానా దగ్గుబాటితో కలిసి ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆఖరి దశ పనుల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ తన కెరీర్లో చాలా ప్రత్యేకమైన సినిమా అని అంటోంది కాజల్. ఎందుకంటే తనను తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం చేసిన దర్శకుడు తేజతో చాలా ఏళ్ల తర్వాత చేస్తున్న రెండవ సినిమా అని, ఆయన తన పాత్రను చాలా వైవిధ్యంగా తీర్చిదిద్దారని, అందుకే ఈ చిత్రం తనకు చాలా ప్రత్యేకమైనదని అంది.

అలాగే తన బెస్ట్ ఫ్రెండ్ రానాతో కలిసి నటించిన సినిమా కావడం కూడా ఈ ప్రత్యేకతకి మరొక కారణమని, స్నేహితులతో కలిసి పని చేయడం ఎప్పుడూ సరదాగానే ఉంటుందని అంది. ఇకపోతే కాజల్ కు 50వ సినిమా అయిన ఈ ‘నేనే రాజు నేనే మంత్రి’ ని రానా తండ్రి సురేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. ‘బాహూబలి తర్వాత రానా ఫుల్ లెంగ్త్ రోల్ లో చేస్తున్న సినిమా కావడం, రిలీజైన ఫస్ట్ లుక్స్, టీజర్ కూడా బాగుంటంతో సినిమాపై అంచనాలు మంచి స్థాయిలోనే ఉన్నాయి.