టీఆర్పీ రికార్డ్స్ కి చెక్..మహేష్, తారక్ ల బ్లాస్టింగ్ ఎపిసోడ్ వస్తుంది..

Published on Nov 20, 2021 12:04 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక్క సిల్వర్ స్క్రీన్ పైనే కాకుండా స్మాల్ స్క్రీన్ పైన కూడా హిట్ అయ్యాడు. అలాగే తన ప్రెజెన్స్ తో షో ని కూడా ఇంకో లెవెల్లో నిలబెట్టగలడు. అలానే ఇప్పుడు చేస్తున్న “ఎవరు మీలో కోటీశ్వరులు”కూడా ఒకటి. అదిరే రేటింగ్స్ తో తారక్ ఈ షో ని సక్సెస్ ఫుల్ గా తీసుకెళ్తున్నాడు. మరి ఈ షోలో కొంతమంది సినీ తారలు కూడా స్పెషల్ ఎపిసోడ్స్ కి వస్తారని తెలిసిందే.

అలా ఈ షోలో ఓ గ్రాండ్ ఎపిసోడ్ ని మేకర్స్ ప్లాన్ చేశారు. అదే సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో. ఈ ఎపిసోడ్ షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయ్యింది కానీ మంచి టైం కి ఈ ఎపిసోడ్ ని టెలికాస్ట్ చెయ్యాలని హోల్డ్ లో ఉంచారు. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఈ మోస్ట్ అవైటెడ్ ఎపిసోడ్ ని టెలికాస్ట్ కి రెడీ చేస్తున్నట్టు తెలుపుతున్నారు.

ఇప్పుడు ఇద్దరి మధ్య ఓ పోస్టర్ కూడా ఇపుడు బయటకి వచ్చి వైరల్ అవుతుంది. అయితే ఈ ఎపిసోడ్ పై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. అందుకే ముందు టీఆర్పీ రికార్డ్స్ ని ఈ బ్లాస్టింగ్ ఎపిసోడ్ ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది అని గట్టి టాక్ ఉంది. మరి ఈ మోస్ట్ అవైటెడ్ ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More