మహేష్ బాబు ఆహ్వానాన్ని అంగీకరించిన తారక్ ?

మహేష్ బాబు తాజా చిత్రం ‘భరత్ అనే నేను’ చిత్రం ఈ నెల 20న విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఇంకో మూడు రోజుల్లో అనగా ఏప్రిల్ 7వ తేదీన చిత్ర ఆడియో వేడుకను హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా చరణ్, ఎన్టీఆర్ లను మహేష్ ఆహ్వానించారని మొదట్లో వార్తలొచ్చినా తర్వాత వాటిలో నిజం లేదని తేలింది.

మళ్ళీ ఇప్పుడు మహేష్ ఎన్టీఆర్ కు పర్సనల్ గా ఫోన్ చేసి మరీ వేడుకకు రావాలని ఆహ్వానించారని, ఎన్టీఆర్ కూడ అందుకు అంగీకరించారని సినీ వర్గాల టాక్. ఒకవేళ ఇదే నిజమైతే ఈవెంట్ భారీ స్థాయిలో సక్సెస్ కావడం ఖాయం. మరి ఈ వార్తలో నిజముందో లేదో స్పష్టత రావాలంటే నిర్మాణ సంస్థ నుండి అధికారిక ప్రకటన వెలువడే వరకు ఎదురుచూడాల్సిందే. ఇకపోతే కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కావడంతో ‘భరత్ అనే నేను’పై అభిమానుల్లో, డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి.