రామ్ సినిమాకు ఎన్టీఆర్ కెమెరామెన్ !
Published on Mar 4, 2018 12:06 pm IST

దిల్ రాజు నిర్మాణంలో త్రినాద్ రావ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నాటిస్తోన్న సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు విజయ్ కె చక్రవర్తి సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. విజయ్ గతంలో ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాకు వర్క్ చేశారు. ప్రసన్న కుమార్ ఈ సినిమాకు సంభాషణలు సమకూరుస్తున్నారు.

వచ్చే వారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. త్రినాధ్ రావ్ గతంలో దర్శకత్వం వహించిన సినిమా చూపిస్తా మావా, నేను లోకల్ తరహాలో కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ చిత్రంలో నటించబోయే సెకండ్ హీరోయిన్ ఎవరనేది త్వరలో తెలియనుంది.

 
Like us on Facebook