ఎన్టీఆర్ ‘బాల రామాయణం’కు 25 ఏళ్లు.. ఫోటోలు వైరల్!

Published on Apr 11, 2022 12:00 pm IST

జూనియర్ ఎన్టీఆర్ సినీ ప్రస్థానం ‘ఎం.ఎస్ .రెడ్డి’ గారు నిర్మించిన ‘బాల రామాయణం’ సినిమాతో మొదలైంది. ఈ చిత్రంలో రాముడి పాత్రలో బాల నటుడిగా నటించిన తారక్ నటనా జీవితానికి ఈ చిత్రం పునాది అయింది. నేడు తారక్ స్టార్ హీరోగా ఎదగడానికి ఈ చిత్రం ఎంతగానో దోహదం చేసింది. కాగా ఈ చిత్రం రిలీజ్ అయి నేటితో 25 ఏళ్ళు అవుతుంది.

‘బాల రామాయణం’ సినిమా విడుదలై 25 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా.. ఈ సినిమాకు సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. దర్శకుడు గుణశేఖర్ చిన్నారులతో చూడచక్కగా ఈ ఇతిహాసమైన రామాయణాన్ని తెరకెక్కించాడు. ఐతే, ‘ఎం.ఎస్ .రెడ్డి’ నిర్మాణ విలువలు ఈ చిత్రాన్ని మరో స్థాయిలో నిలబెట్టింది.

అలాగే ఈ చిత్రం జాతీయ అవార్డులను సైతం కైవసం చేసుకుంది. ఈ బాల రామాయణం చిత్రంలో రాముడిగా ఎన్టీయార్ అద్భుతంగా నటించగా.. స్మితా మాధవ్ సీత పాత్రలో నటించారు.

సంబంధిత సమాచారం :