మలుపులు ట్విస్ట్ ల మధ్యలో ‘మహానాయకుడు’ !

Published on Feb 4, 2019 5:50 pm IST

ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ జనవరి 9న విడుదలై, మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్నప్పటికీ.. ఆశించిన స్థాయిలో కలెక్షన్లను మాత్రం రాబట్టలేకపోయింది. దాంతో చిత్రబృందం ‘మహానాయకుడు’ ఫై ప్రత్యేకమైన కేర్ తీసుకుంటున్నారు. అందులో భాగంగానే స్క్రిప్ట్ లో ఎక్కడా లాగ్ లేకుండా.. ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ ను యాడ్ చేస్తూ.. మొత్తానికి ‘మహానాయకుడు’కి బాగానే పోస్ట్ మార్టమ్ చేశారు. దీనిబట్టి ఈ సారి ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని మహానాయకుడు టీం గట్టిగానే ప్రయత్నిస్తోన్నట్లు ఉంది.

హిట్ అవుతుందని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు కూడా. అందుకే.. ‘కథానాయకుడు’ కొని నష్ట పోయిన డిస్ట్రీబ్యూటర్లకే బయ్యర్స్ కే ‘మహానాయకుడు’ని అమ్మి వాళ్ళకు వచ్చిన నష్టాలన్ని లాభాలుగా మార్చాలని ఎన్టీఆర్ మేకర్స్ భావిస్తోన్నారట. పైగా ‘మహానాయకుడు’లో ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని చూపించనున్నారు. ఒక సినిమా కథకు ఎలాంటి సరుకు కావాలో, అంతకంటే అద్భుతమైన మలుపులు ట్విస్ట్ లతో ఎన్టీఆర్ రాజకీయ జీవితం సాగింది.

దాంతో సహజంగానే మహానాయకుడు పై ప్రేక్షకులకు కూడా ఆసక్తి ఏర్పడుతుంది. మరి ఆ ఆసక్తిని ఎంతవరకూ పెంచేగలరు అనేదాన్ని బట్టే.. మహానాయకుడు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్ బి కె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్, విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :