వైరల్..పవన్ సినిమాల్లో ఎన్టీఆర్ కి బాగా ఇష్టమైన సినిమా..!

Published on Nov 26, 2021 12:00 pm IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా “ఎవరు మీలో కోటీశ్వరులు” అనే గ్రాండ్ రియాలిటీ షో చేస్తున్న సంగతి తెలిసిందే. తాను మొదటి సారి ఈ షో సీజన్లో పాల్గొన్న తారక్ తన చాతుర్యంతో షో రేటింగ్ ని ఓ స్టేజ్ లో నిలబెట్టడమే కాకుండా ఒక స్టాండర్డ్ రేటింగ్ తో తీసుకెళ్తున్నాడు. మరి ఇందులో ఆటతో పాటు ఆడే కంటెస్టెంట్స్ తో వినోదం కూడా అంతే స్థాయిలో ఉంటుందని తెలిసిందే.

మరి ఇందులో ఎన్టీఆర్ లేటెస్ట్ గా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో తనకి బాగా ఇష్టం అయ్యినటువంటి సినిమా “తొలిప్రేమ” సినిమా అని చెప్పడం ఇద్దరి హీరోల అభిమానుల్లో కూడా వైరల్ అవుతుంది. మొత్తానికి ఈ షో ద్వారా ఓ స్టార్ హీరో అభిమానులు ఇంకో స్టార్ హీరో అభిమానులతో మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పర్చుకున్నట్టు అవుతుంది.

సంబంధిత సమాచారం :

More