‘కథానాయకుడు’ నుంచి లేటెస్ట్ అప్ డేట్ !

Published on Oct 28, 2018 1:25 pm IST

నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్స్ శరవేగంగా తెరకెక్కతున్న విషయం తెలిసిందే. కాగా ఈ బయోపిక్ మొదటి పార్ట్ ‘కథానాయకుడు’లో ఎన్టీఆర్ గారి జీవితంలో జరిగిన పలు ఆసక్తికరమైన అంశాలను చూపించనున్నారు. అందులో ముఖ్యంగా ఎన్టీఆర్ గారి ప్రేమ వివాహం ఒక్కటి. బసవతారకమ్మగారిని ఎన్టీఆర్ గారు ప్రేమించి వివాహం చేసుకున్నారని సమాచారం. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ – బసవతారకమ్మ గార్ల పెళ్లికి సంబంధించిన సన్నివేశం కూడా ఉందట. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల లో చిత్రబృందం ఆ సన్నివేశాలనే చిత్రీకరిస్తున్నారు.

కాగా ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే పాటలను కూడా ఆయన పూర్తి చేశారని, చాలా బాగా వచ్చాయని తెలుస్తోంది. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. బాలయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :